JDWL: ధరూరు మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. బుధవారం ప్రాజెక్టులోకి 1,23,008 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం 6 గేట్లు మాత్రమే తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. గేట్ల ద్వారా 85,905 క్యూసెక్కులు, పవర్ హౌస్కు 37,013 క్యూసెక్కుల నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.