MBNR: సినీ నిర్మాత బండ్ల గణేష్ షాద్ నగర్ నుంచి తిరుపతి వరకు చేపట్టిన పాదయాత్ర సోమవారం బాలానగర్ చేరుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు విజయం కోసం మొక్కుకున్న మొక్కును తీర్చుకునేందుకే ఈ యాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక అభిమానులు, ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు పలువురు ఉత్సాహం చూపారు.