NZB: ఆలూరు మండలం కల్లెడిలో చిన్నారులకు ఉచిత దుస్తులు పంపిణీ చేశారు. శనివారం అంగన్వాడీ-1 కేంద్రంలో సర్పంచ్ గంగోల్ల సుస్మిత ప్రళయ్ తేజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చిన్నారులకు పౌష్ఠికాహారంతోపాటు మెరుగైన వసతులు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అంగన్వాడీలు కీలకమని ఆమె పేర్కొన్నారు.