NGKL: ఊరుకొండపేటలోని శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన రథోత్సవంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పాల్గొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఊర్కోకొండ ఆధ్యాత్మికక్షేత్రంలో ఉత్సవాలు ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు.