SRCL: చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో యూరియా కోసం రైతులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే చెప్పులను వరుస పెట్టి క్యూలో నిలబడ్డారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రోజుల తరబడి యూరియా కోసం ఎదురుచూస్తున్న దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం గంటల తరబడి నిరీక్షించిన యూరియా దొరకలేదన్నారు. ప్రభుత్వం వెంటనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.