NLG: మునుగోడు నియోజకవర్గంలో ఎవరూ కంటి సమస్యలతో బాధపడకూడదన్న సంకల్పంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులకు ఆయన స్వయంగా భోజనం వడ్డించి తన ఉదారతను చాటుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి పరీక్షలు, మందులు మరియు కళ్లద్దాల పంపిణీ తీరును సమీక్షించారు.