MIM : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతు..
తెలంగాణలో (Telangana) మరోసారి ఎన్నికలకు నగారా మోగింది. ఇటీవలు కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ( MLC) ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఎన్నికల జరగనుంది. వీటిలో ఒకటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కాగా.. మరొకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక.
తెలంగాణలో (Telangana) మరోసారి ఎన్నికలకు నగారా మోగింది. ఇటీవలు కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ( MLC) ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఎన్నికల జరగనుంది. వీటిలో ఒకటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కాగా.. మరొకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక. హైదరాబాద్-రంగారెడ్డికి సంబంధించి స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ ( MLC) ఎన్నిక ఆసక్తికరంగా మారింది.హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని గతంలో ఎంఐఎంకు బీఆర్ఎస్ కేటాయించగా.. ఈ సారి కూడా ఎంఐఎంకే మద్దతు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా ఎంఐఎం ( MIM) ఉంది. దీంతో ఆ పార్టీకే హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గత తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు తెలుపుతూ వస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మజ్లిస్ (Majlis)మద్దతుతోనే బీఆర్ఎస్ గట్టెక్కింది.
ఈ క్రమంలో ఎమ్మెల్సీ సీటును ఎంఐఎంకే కేసీఆర్ అప్పగించారని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం వెనుక అసలు కారణం ఇదేనని అంటున్నారు. ముస్లిం ఓట్లు చీలిపోతే బీఆర్ఎస్ కు కూడా నష్టం కలిగే అవకాశముంది. ప్రస్తుతం ‘మహబూబ్‌నగర్– రంగారెడ్డి– హైదరాబాద్’ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీగా ఉన్న కాటేపల్లి జనార్దన్‌రెడ్డి ( Janardhan Reddy) పదవీకాలం ఈ ఏడాది మార్చి 29న ముగియనుంది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న అమీనుల్ హసన్ జాఫ్రీ(Hasan Jaffrey) (ఎంఐఎం) ( MIM) పదవీకాలం మే 1న పూర్తవుతోంది. త్వరలో ఈ రెండు సీట్లు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటికి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది.వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా మొదలైంది. ఈ నెల 23 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. వచ్చే నెల 13న పోలింగ్ నిర్వహించి.. 16న ఓట్ల లెక్కింపు జరుపుతారు. రాష్ట్ర శాసనమండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా.. అందులో బీఆర్ఎస్ (BRS) వారే 36 మంది కావడం, మిత్రపక్షం ఎంఐఎంకు ఇద్దరు సభ్యులు ఉండటం గమనార్హం. ఇక కాంగ్రెస్ నుంచి ఒకరు, మరొకరు ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ ఉన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో మొత్తం 127 మంది ఓటర్లు ఉండగా..
ఇందులో సికింద్రాబాద్ (Secunderabad) కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 8 మంది సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గుడిమల్కాపూర్ (Gudimalkapur) బీజేపీ కార్పొరేటర్ దేవర కరుణాకర్ ఈ ఏడాది జనవరిలో మరణించారు. దీనితో ప్రస్తుతం ఓటర్ల సంఖ్యను 118గా ఎన్నికల సంఘం నిర్ధారించింది. ఇందులో 83 మంది జీహెచ్ఎంసీ కార్పొరేటర్లుకాగా.. మిగతా 35 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు. ఈ ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో వివిధ పార్టీలకు చెందిన ఐదుగురు రాజ్యసభ, ఇద్దరు లోక్‌సభ సభ్యులు, 12 మంది ఎమ్మెల్సీలు, 16 మంది ఎమ్మెల్యేలకు (నామినేటెడ్ ఎమ్మెల్యేను కూడా కలుపుకొని).. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు హక్కు ఉంది. అయితే ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారడం, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డి.వెంకటేశ్, అడిక్‌మెట్ కార్పొరేటర్ సునీత ప్రకాశ్‌గౌడ్ ఇద్దరూ బీజేపీ (Bjp) నుంచి బీఆర్ఎస్లో చేరడం నేపథ్యంలో ఆయా పారీ్టల వాస్తవ బలాబలాలపై లెక్కలు వేస్తున్నారు. ఓటర్ల జాబితా ప్రకారం కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీíÙయో సభ్యులు కలిపి బీజేపీ 33 ఓట్ల బలం ఉంది. అదే బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ కలిపి 83 మంది ఓటర్లు సమకూరనున్నారు.