కర్ణాటక ఎన్నికలకు తెలంగాణ ఎన్నికల సంబంధమే లేదని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి (CM KCR)కేసీఆర్ కాంగ్రెస్‌కి ఫండింగ్ ఇచ్చారని ఆరోపించారు
బీజేపీ (BJP) రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు వాడీవేడిగా జరిగాయి. చంపాపేటలో నిర్వహించిన ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) సీరియస్ అయ్యారు. నేతలు కట్టు దాటితే వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా పార్టీ టికెట్లపై నేతలకు బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. టికెట్లు కావాలంటే ప్రజల మధ్య ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ అధ్యక్షులు సంజయ్ పార్టీ జెండాను ఆవిష్కరించి సమావేశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాక్యలు చేశారు. తెలంగాణ(Telangana)లో ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కలేదని, అలాంటి పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయం అని అన్నారు. డిపాజిట్ దక్కని కాంగ్రెస్ పార్టీ (Congress party) ప్రత్యామ్నాయం ఎట్ల అయితదని సంజయ్ ప్రశ్నించారు.
దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కలేదు. GHMC ఎన్నికల్లో బీజేపీ 48 కార్పొరేటర్ సీట్లు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ రెండు కార్పొరేటర్ సీట్లు మాత్రమే గెలిచింది. హుజూరాబాద్(Huzurabad)లో భారీ మెజారిటీతో బీజేపీ గెలిచింది. కాంగ్రెస్‌కు డిపాజిట్ దక్కలేదు. మునుగోడు (Munugodu) లో బీజేపీకి సుమారు 90వేల ఓట్లు వస్తె.. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి గెలిస్తే.. కాంగ్రెస్ అభ్యర్ధి అడ్రసే లేడు. కరీంనగర్, నిజామాబాద్ కార్పోరేషన్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచింది. కరీంనగర్, నిజామాబాద్(Nizamabad)లో కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లంతు అయింది. మేధావులు, మీడియా యాజమాన్యాలు, విశ్లేషకులు ఆలోచించండి.. ఇది నిజమా కాదా? బీఆర్ఎస్కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం ఎట్లా అయితదని అని బండి సంజయ్ ప్రశ్నించారు.కార్యవర్గ సమావేశాల వేదికగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు అమలు చేయడం జరుగుతుందో బండి సంజయ్ వెల్లడించారు. ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. అదేవిధంగా ఉచిత విద్య అమలు చేస్తామని, ఫీజు రీయింబర్స్ మెంట్ సకాలంలో చెల్లిస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, రైతులకు ఫసల్ బీమా(Crop Insurance) యోజన పథకంను అమలు చేస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.