KMR: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రోత్సాహంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థినులకు ISROను సందర్శించే అవకాశం లభించింది. గత అక్టోబర్ నెలలో నిర్వహించిన ప్రతిభా పరీక్ష ద్వారా ఎంపికైన 50మంది విద్యార్థినులు, 30 మంది ఉపాధ్యాయులు ఈ నెల 29న ఇస్రో సందర్శనకు వెళ్లనున్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను కలెక్టరేట్ కార్యాలయం సోమవారం విడుదల చేసింది.