MLG: ములుగు మండలం జంగాలపల్లి క్రాస్ వద్ద ఆదివారం పశువుల అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ ఉదయం వాహన తనిఖీల సమయంలో బొలెరో వాహనంలో 3 ఎడ్లు, 5 ఆవులు తరలిస్తున్న డ్రైవర్ ప్రకాష్, ఓనర్ బాలాజీలను పట్టుకుని కేసు నమోదు చేసి, పోలీస్ స్టేషన్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.