ADB: సాధారణ బదిలీల్లో భాగంగా బోథ్ నూతన ఎస్సైగా పురుషోత్తం బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేసి సోమవారం బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఇచ్చోడ ఎస్సైగా విధులు నిర్వహించి ప్రస్తుతం బోథ్ SHOగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేశారు.