HYD: బల్కంపేటలోని నేచర్ క్యూర్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద ఉన్న ప్రభుత్వ పాఠశాల ఎదురుగా చెత్త రాజ్యమేలుతోంది. కొన్ని రోజులుగా చెత్తను క్లియర్ చేయకపోవడంతో గుట్టలుగా పేరుకుపోయింది. వీధి కుక్కలతో పాటు ఇతర జంతువులు వచ్చి అపరిశుభ్రంగా మారుస్తున్నాయని స్థానికులు తెలిపారు. శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యంతో చెత్త పేరుకుపోయిందని ఆరోపించారు.