MNCL: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నవంబర్ 29న మంచిర్యాలలోని బాయ్స్ హై స్కూల్ నందు దివ్యాంగులకు ఆటల పోటీలు జరగాల్సి ఉంది. పంచాయతీ ఎన్నికల కోడ్ ప్రభావంతో అంతర్జాతీయ దివ్యాంగుల ఆటల పోటీలు వాయిదా పడినట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎలక్షన్ తర్వాత మళ్లీ ఈ పోటీలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.