BDK: ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్‌కు మంగళవారం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (హెచ్-142) రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.రామారావు లేఖ అందజేశారు. కేటీపీఎస్ విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, విశ్రాంతి ఉద్యోగుల కోసం తక్షణమే వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ బహిరంగ లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు ఇబ్బందులు పడకూడదన్నారు.