NZB: శ్రీరామ్ సాగర్ 8 వరద గేట్లను ఎత్తి అధికారులు గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 80.5TMCలు కాగా ప్రస్తుతం 80.053TMCల నీరు ఉంది. 8 వరద గేట్ల ద్వారా 25వేల క్యూసెక్కులను గోదావరిలోకి వదులుతున్నారు. అలీసాగర్ ఎత్తిపోతల పథకానికి 360 క్యూసెక్కులు, గుత్ప ఎత్తిపోతలకు 270, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు.