NZB: చందూర్ మండల కేంద్రానికి చెందిన గాండ్ల వరప్రసాద్‌ను తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నారు. హైదరాబాద్‌లోని కేశవ మెమోరియల్ పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ నియమించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాడతానని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.