RR: పేద, మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో CM రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని MLA వీర్లపల్లి శంకర్ అన్నారు. కొందుర్గు కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు భూమిపూజ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సుమారు రూ.200 కోట్లతో త్వరలోనే స్కూల్ నిర్మాణ పనులు చేపట్టబోతున్నామన్నారు.