WGL: జిల్లాలోని MGM ఆసుపత్రిని కలెక్టర్ సత్య శారద మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఓపీ జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, సర్జరీ, సైక్రియాట్రిక్, న్యూ మేల్ సర్జికల్ వార్డ్, ఐసీయూ, పీఐసీయూ, సెంట్రల్ ల్యాబ్, రేడియాలజీ, ఎమర్జెన్సీ విభాగాలను తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. సేవలు మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.