MBNR: అడ్డాకుల మండలంలో గొర్రెలు, మేకలను వ్యాధుల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం పీపీఆర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం నేటి నుంచి సెప్టెంబర్ 20 వరకు అన్ని గ్రామాల్లో కొనసాగుతుందని మండల పశువైద్య అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. గొర్రెలు, మేకలు పెంచుకునే రైతులు తప్పనిసరిగా ఈ టీకాలు వేయించుకోవాలని ఆయన సూచించారు.