WGL: దుగ్గొండి మండలంలోని గిర్నీబావి ఫంక్షన్ హాల్లో ఇవాళ సర్పంచ్ ఎన్నికల సన్నాహ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీలు కావాలని విమర్శించడం సరికాదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డితో సాధ్యమన్నారు. సర్పంచ్ అభ్యర్థులు గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.