MBNR: గండేడ్ మండలం పెద్దవార్ వాల్ గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని మంగళవారం ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణ దేవి మాట్లాడుతూ.. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు.