KNR: విద్యుత్ తీగలకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగింపులో భాగంగా 11 కేవీ ఇండస్ట్రీయల్ పరిధిలోని సాయి బాబా ఆలయం, పద్మనగర్, మార్కేండయ నగర్, లారెల్, మానేర్ నగర్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీ ఈ. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.00 గంటల వరకు పవర్ కట్ ఉన్నందున వినియోగదారులు సహకరించాలని కోరారు.