KMM: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా జనరల్ ఎలక్షన్ అబ్జర్వర్ శ్రీ కాళీచరణ్ను నిన్న జిల్లా కలెక్టర్ అనుదీప్, అడిషనల్ కలెక్టర్ పి.శ్రీజ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల నిర్వహణలో ఆయన అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతూ శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో అబ్జర్వర్ పాత్రను కొనియాడారు.