BDK: సింగరేణి సంస్థ కొత్తగూడెం కార్పొరేట్ ఆఫీస్లో ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. టీ.ఎస్. గ్రేడ్-హెచ్లో మొత్తం 26 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో పనిచేసే జనరల్ అసిస్టెంట్లు ఈ పోస్టులకు అర్హులుగా యాజమాన్యం ప్రకటించింది. ఈ నెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం పేర్కొంది.