MHBD: మహబూబాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఆదర్శ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బయ్యారం, డోర్నకల్, MHBD నందు ఖాళీలకై అర్హత కల్గిన నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి టి. రజిత పేర్కొన్నారు. ఈనెల 2 న జిల్లా కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. 10.30 గం.ల నుంచి మ.2 వరకు ఈ మేళా ఉంటుందని అన్నారు.