SRD: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం కింద గడ్డపోతారం మున్సిపాలిటీలో 18 సంవత్సరాలు పైబడిన మహిళలకు చీరల పంపిణీ చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ వెంకట రామయ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు చీరలు అందజేశారు. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.