KNR: రవాణా శాఖ తరుపున ఆర్టీసీ రాణిగంజ్ నుంచి 65 బస్సులు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేటలలో ఈ బస్సులు నడుస్తున్నాయి. ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహా లక్ష్మీ పథకం ప్రారంభం చేసుకొని 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం అన్నారు.