KNR: కరీంనగర్ జిల్లాలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. కరీంనగర్ రూరల్ సంబంధించి ఎంపీడీవో కార్యలయంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేసారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమెల సత్పతి ఆదేశాల మేరకు కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ ఆధ్వర్యంలో ఎన్నికల సామాగ్రి పంపిణి నిర్వహిస్తున్నారు.