NRML: ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించి వారి మన్ననలు పొందాలని ఆదిలాబాద్ రీజినల్ డిప్యూటీ ఆర్ ఎం ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని బస్ డిపోలో ఆర్టీసీ ఆధ్వర్యంలో పవర్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల్లో నైపుణ్యాన్ని, సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి పవర్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.