పెరుగు తింటే జీర్ణకోశం ఆరోగ్యంగా ఉంటుందని.. ఎముకలు గుల్లబారటం, మధుమేహం ముప్పులూ తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేగాక.. వారానికి రెండు, అంతకన్నా ఎక్కువ కప్పుల పెరుగు తినేవారికి కుడివైపున వచ్చే పెద్ద పేగు క్యాన్సర్.. ముప్పు తగ్గుతున్నట్టు వెల్లడైంది. పెద్ద పేగులో ఎడమ వైపున వచ్చే క్యాన్సర్ కన్నా కుడి వైపు క్యాన్సర్ తీవ్రమైంది కావటం గమనార్హం.