KMM: నగరంలో ప్లాస్టిక్ కవర్లను అధికారులు పట్టుకున్నారు. 39వ డివిజన్ శివాలయం బజార్లో ఉంటే కంచర్ల కిశోర్ షాప్లో అధికారులు తనిఖీలు చేశారు. దీంతో రూ. 50 వేలు విలువ చేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను గుర్తించి రూ. 10 వేలు ఫైన్ విధించినట్లు ఖమ్మం నగర శానిటరీ అధికారి మల్లయ్య తెలిపారు. మరోసారి అమ్మకాలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.