»Autodrivers Should Be Given A Living Wage Harish Rao
Harish Rao: ఆటోడ్రైవర్లకు రూ. 15 వేల జీవన భృతి ఇవ్వాలి
మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడం మంచిదే అని, అయితే ఒకరికి మంచి చేసి మరొకరి కడుపు కొట్టడం సరైనది కాదని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లకు జీవన భృతి ఇవ్వాలన్నారు.
Autodrivers should be given a living wage.. Harish Rao
Harish Rao: తెలంగాణలో ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణంగా ఉందని మజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) అన్నారు. సిద్ధిపేటలో మాట్లాడిన ఆయన తెలంగాణ(Telangana)లో ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం గురించి మాట్లాడారు. తెలంగాణ మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం మంచి ఆలోచనే అని అన్నారు. అయితే మహిళలకు మంచి చేసి ఆటో డ్రైవర్ల కడుపు కొట్టడం మంచిది కాదని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రతీ నెల రూ. 15 వేలు జీవన భృతి ఇవ్వాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు ఏ కష్టం రాలేదని వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల హామీలో ఇచ్చిన 6 గ్యారెంటీలలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్ధి పెరిగింది. ప్రయివెేట్ బస్సు యాజమానులు కూడా తమ వాహనాలు పాడు అవుతున్నాయని ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను పెట్టారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వారితో మంతనాలు జరిపాడు. ప్రస్తుతం ఉన్న బస్సులతో పాటు మరిన్ని కొత్త బస్సులను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.