YS Sharmila: ఏపీ సీఎం జగన్ సోదరి, కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్ల తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని చంద్రబాబు కుటుంబానికి ఆహ్వాన పత్రికను అందజేశానని.. వివాహానికి వస్తానని చంద్రబాబు చెప్పారని షర్మిల తెలిపారు. నా తండ్రి వైఎస్‌తో ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని షర్మిల తెలిపారు.
క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్‌కు స్వీట్లు పంపాం. కేటీఆర్, కవిత, హరీశ్‌రావుకు కూడా స్వీట్లు పంపామని షర్మిల తెలిపారు. షర్మిల కుమారుడు రాజారెడ్డికి వివాహం నిశ్చియమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17వ తేదీన అట్లూరి ప్రియతో రాజారెడ్డి వివాహం జరగబోతుంది. ఈక్రమంలో జనవరి 18వ తేదీన వీరి నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నారు. ఇది వరకే సీఎం జగన్‌ను వివాహానికి షర్మిల ఆహ్వానించారు.