»Atrocity In Government Hospital Patients Legs Were Locked
Nizamabad : సర్కారు దవాఖానాలో దారుణం..రోగి కాళ్లు పట్టి లాక్కెళ్లారు…
ఇందూరు ప్రభుత్వాసుపత్రిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తామన్న ప్రజాప్రతినిధులు ఆ ఊసే మరిచారు. అన్ని హంగులు ఉన్నాయని బయటకు మెరుస్తుతున్నా సిబ్బంది లేక వైద్యులు రాక రోగులు (Patients) పడుతున్న బాధలు అంతా ఇంతా కాదు. ఓ వైపు సర్కారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో భేష్ అని గొప్పలు చెప్పుకుంటున్నా.... ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రి(Government Hospital) లో కనీసం స్ట్రెచర్ లేకపోవటం ఆందోళనకు గురి చేస్తోంది.
నిజామాబాద్ జిల్లా (Nizamabad District) ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో రోగి కాళ్ళను పట్టుకొని లాక్కుంటూ తీసుకువెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. జిల్లా ప్రభుత్వాసుపత్రి(Government Hospital)ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తామన్న ప్రజాప్రతినిధులు ఆ ఊసే మరిచారు. అన్ని హంగులు ఉన్నాయని బయటకు మెరుస్తుతున్నా సిబ్బంది లేక వైద్యులు (Doctors) రాక రోగులు పడుతున్న బాధలు అంతా ఇంతా కాదు. ఓ వైపు సర్కారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో భేష్ అని గొప్పలు చెప్పుకుంటున్నా…. ఇక్కడి దవఖానాలో లో కనీసం స్ట్రెచర్ లేకపోవటం ఆందోళనకు గురి చేస్తోంది. ఆస్పత్రి ఏడంతస్తుల అద్దాల మేడ. చూడటానికి బాగున్నా ఆస్పత్రిలో వసతులు లేక వచ్చే రోగులు (Patients) నరకయాతన పడుతున్నారు అనడానికి ఓ ఉదారణ ఇప్పుడు వైరల్‌గా మారింది. రోగిని లోపలికి తరలించేందుకు సిబ్బంది ముందుకు రాకపోవడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
దీంతో బయటి నుంచి లిఫ్ట్ దాకా పేషంట్ కాళ్లు పట్టుకుని తీసుకువెళ్లిన దృశ్యాలు స్థానికులను కలిచివేశాయి. పేషెంట్ ను లాకెళ్తున్న వీడియో ఓ వ్యక్తి తీసి సోషల్ మీడియా(Social media)లో పెట్టడంతో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్ లు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై మండిపడుతున్నారు. గతంలో కూడా కరోనా సమయం(Corona time)లో ప్యాసింజర్ ఆటోలో మృతదేహాన్ని తరలించిన దృశ్యాలు దుమారం రేపింది. తాజాగా ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.పేరుకు మాత్రం పెద్దాసుపత్రి. వసతులు మాత్రం కరువు. ఆస్పత్రిలో స్కానింగ్ (scanning) ఉన్నా తీయరు. ప్రయివేట్‌కు రిఫర్ చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి స్కానింగ్ మెషిన్ పెడితే పాడైందని సమాధానం వస్తోంది. ఎమర్జెన్సీ కేసులు(Emergency cases) వస్తే హైదరాబాద్ వెళ్లాలని చెప్పేస్తారు. ఇలా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులు. దీంతో ఆసుపత్రి అధికారులు , ప్రజలు సిబ్బందిపై మండిపడుతున్నారు