మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైకోర్టు (High Court) షాక్ షాకిచ్చింది. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి హైకోర్టు 10 వేల జరిమానా విధించింది. 2018 ఎన్నికల అఫిడవిట్(Affidavit)లో ఆమె ఆస్తులు చూపలేదని, తప్పుడు సమాచారం ఇచ్చారని గతంలో పిటిషన్ దాఖలైంది.గత శాసనసభ ఎన్నికల తర్వాత ఈ కేసు నమోదు అయింది. ఎమ్మెల్యే సునీత (MLA Sunitha) ఇప్పటి వరుకు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో న్యాయస్థానం ఆగ్రం వ్యక్తం చేస్తూ ఫైన్ విధించింది. ఆస్తులను చూపలేదని సైని సతీష్ కుమార్ (Satish Kumar) అనే వ్యక్తి హైకోర్టు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తప్పుడు సమాచారం అందించినందుకు ఆమె ఎన్నికల చెల్లదని, అనర్హత వేటు వేయాలని హైకోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సునీతను ఆదేశించింది. ఈ పిటీషన్ (Petition)పై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేకు ఫైన్ విధించిన కోర్టు.. ఈ కేసు విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది.