»Amit Shahs Plane Got Stuck At Hakeempet Due To A Technical Fault
Amit Shah : సాంకేతిక లోపంతో హకీంపేటలోనే నిలిచిపోయిన అమిత్ షా విమానం
కేంద్రహోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఇవాళ హైదరాబాదులో (Hyderabad) సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే ఉత్సవాలో పాల్గోన్నారు. హకీంపేటలో సీఐఎస్ఎఫ్ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన సీఐఎస్ఎఫ్ (CISF) అధికారులకు అమిత్ షా రివార్డులు అందించారు. అమిత్ షా హైదరాబాదు (Hyderabad) నుంచి కొచ్చి వెళ్లాల్సి ఉండగా, ఆయన ప్రయాణించాల్సి విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది.
కేంద్రహోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఇవాళ హైదరాబాదులో (Hyderabad) సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే ఉత్సవాలో పాల్గోన్నారు. హకీంపేటలో సీఐఎస్ఎఫ్ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన సీఐఎస్ఎఫ్ (CISF) అధికారులకు అమిత్ షా రివార్డులు అందించారు. అమిత్ షా హైదరాబాదు (Hyderabad) నుంచి కొచ్చి వెళ్లాల్సి ఉండగా, ఆయన ప్రయాణించాల్సి విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దాంతో ఆయన హకీంపేట విమానాశ్రయంలోనే ఉండిపోయారు. విమాన మరమ్మతులకు సమయం పట్టడంతో అమిత్ షా… విమానాశ్రయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,(Union Minister Kishan Reddy) తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay)లతో సమావేశమయ్యారు.
కాగా, అమిత్ షా మరో విమానంలో కొచ్చి (Kochi)వెళతారని తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ఈడీ విచారణ నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలు, పార్టీకి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. అయితే, మరోసారి రాష్ట్ర పార్టీ నేతలతో అమిత్ షా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ నేపథ్యంలో అమిత్ షా హైదరాబాద్కు రావటం ప్రాధాన్యత సంతరించుకుంది.