తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ మరింత దూకుడు వ్యవహరిస్తోంది. జూలై 2న ఖమ్మం(Khammam)లో జరిగే బహిరంగ సభ తర్వాత ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలనా నిర్ణయం తీసుకున్నాది. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న సునిల్ కనుగోలు (Sunil kanugolu) టీమ్ ఇతర స్వతంత్ర ఏజెన్సీల ద్వారా పార్టీ రాష్ట్రంలో పలు సర్వేలు చేయిస్తోంది. అది పూర్తయిన తర్వాత 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో119 నియోజకవర్గాలు (Constituencies) ఉండగా.. అందులో 50 శాతం సీట్లకు అభ్యర్థులను జూలైలోనే ఖరారు చేస్తారని ఒక సీనియర్ నాయకుడు చెప్పారు. ఈ పేర్లను బహిరంగంగా ప్రకటించరని చెబుతున్నారు. ఆయా అభ్యర్థులకు ముందుగానే వెల్లడిస్తే.. నియోజకవర్గాల్లో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తారు. ఈ 60 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ(Congress party)కి కూడా పెద్దగా తలనొప్పులు తీసుకుని రాని స్థానాలని అంటున్నారు.
దీనికోసం కర్ణాటక తరహా వ్యూహాన్ని అమలు చేయబోతుంది. అక్కడ అధికార బీజేపీ (BJP) ప్రభుత్వం 40 శాతం కమీషన్ సర్కారు అంటూ అప్పట్లో కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఇది పార్టీ విజయానికి ఉపయోగపడింది. ఇదే తరహాలో తెలంగాణలో 30 శాతం కమీషన్ సర్కారు అంటూ ప్రచారం చేయబోతుంది.అధికార బీఆర్ఎస్ను క్షేత్రస్థాయిలో ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతోంది. మిషన్ 120 డేస్ ప్లాన్‌లో భాగంగా కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ (BRS) అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనుకుంటోంది. కర్ణాటకలో పేసీఎం అంటూ 40 శాతం కమీషన్ తీసుకునే సీఎం ఫొటోతో ఒక క్యూఆర్ కోడ్, పోస్టర్లు రూపొందించి విస్తృత ప్రచారం చేసింది కాంగ్రెస్. దీనిద్వారా బీజేపీ ప్రభుత్వ అవినీతి ప్రజల్లోకి వెళ్లింది. ఇప్పుడు ఇదే తరహాలో తెలంగాణలో 30 శాతం బీఆర్ఎస్ సర్కారు అంటూ ప్రచారం చేయబోతుంది.
30 శాతం కమీషన్ సర్కారు అనే నినాదంతోనే బీఆర్ఎస్పై పోరాడేంటుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇప్పుడు అధికారం రాకపోతే ఇంకెప్పటికీ రాదు అనే ప్రణాళికతో, అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకెళ్తోంది. బీఆర్ఎస్ అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేలా ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్న దళిత బంధు(Dalit bandhu) విషయంలో ఎమ్మెల్యేలే అవినీతికి పాల్పడ్డారని, పద్ధతి మార్చుకోవాలని సీఎం కేసీఆర్ (CMKCR) హెచ్చరించిన విషయాన్ని కాంగ్రెస్ గుర్తి చేస్తోంది. అంటే ఎమ్మెల్యేలు ఈ పథకంలో కమీషన్ తీసుకున్నారనే విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రస్తావించారంటే దీనిలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించబోతుంది. దీనిపై క్యూఆర్ కోడ్, డిజైన్‌ను త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించబోతుంది. అలాగే ప్రభుత్వ పథకాలు, వాటి అమలులో వైఫల్యం, అవినీతి అంశాలతో నివేదిక రూపొందిస్తోంది.