NRML: బాసర స్టేషన్ రైల్వే పరిధిలో గోదావరి నదిపై నిర్మిస్తున్న నూతన రైల్వే బ్రిడ్జి పనులు, రైల్వేట్రాక్ ఆధునీకరణతో పాటు డబ్లింగ్ లైన్ పనులను సౌత్ సెంట్రల్ రైల్వే కమిషనర్ మాధవి, డీఆర్ఎం సంతోష్ కుమార్ వర్మ పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.