జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు, నేటి నుంచి నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్పీ పేర్కొన్నారు.