SRPT: ఈ నెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధికారులందరూ ముఖ్యఅతిథి సందేశానికి శాఖల అభివృద్ధి కార్యక్రమాల నివేదికలను పంపించాలన్నారు.