హైదరాబాద్ గాంధీభవన్(Gandhi Bhavan) లో తెలంగాణ ఆదివాసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు.పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ను ఆహ్వానించకపోవడాన్ని నిరసిస్తూ దీక్ష చేపట్టారు.ఆదివాసీ బిడ్డ కావడం వలనే ద్రౌపది ముర్మును ఆహ్వానించకుండా అవమానిస్తున్నారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు.ఇవాళ ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు రాములు నాయక్ (Ramulu Naik) మాట్లాడుతూ.. బీజేపీ (BJP) సర్కార్ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఆదివాసీ మహిళను అవమాన పరచడం సరికాదన్నారు. బీజేపీ సర్కార్ వలనే అంటరాని తనం అనేది మళ్లీ తెరమీదకు వస్తుందన్నారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ ఎంపీలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నదన్నారు.
ఆర్ఎస్ఎస్ (RSS) చేపినట్టు బీజేపీ వ్యవహరించడం సరికదన్నారు. దేశంలో ప్రజాస్వామ్యానికి నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించడం రాజకీయాల్లో తగదని హెచ్చరించారు. త్వరలోనే అహంకార బీజేపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రపతిని పిలవకపోవడంపై కాంగ్రెస్ తరపున జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. ఆదివాసీ సెల్వైస్చైర్మన్ బెల్ల నాయక్ (Bella Naik) మాట్లాడుతూ.. రాజ్యంగం ప్రకారం పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని నిర్వహించలేదన్నారు. బీజేపీ, మోడీ దేశాన్ని నాశనం చేస్తున్నాడన్నారు. దేశానికి పట్టిన చీడ పురుగులంతా బీజేపీలోనే ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో విముక్తి కలిగించేలా తీర్పును ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.