HYD: నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో గల సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్ లీగల్ టీం సభ్యులు చేరుకున్నారు. కాగా ఇప్పటికే పీఎస్ వద్ద పోలీసులు మోహరించిన విషయం తెలిసిందే.