SRD: పార్లమెంట్లో అంబేద్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా సంగారెడ్డిలోని గంజి మైదానంలో ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి సోమవారం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బహిరంగ సభకు హాజరవుతారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.