HYD: శ్రీ రామనవమి శోభాయాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని HYD ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్ నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్ వరకు కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. ఈ మార్గంలో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ అమలులో ఉంటుంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకొని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.