KNRL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఆదివారం మూల బృందావనానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవతో మొదలుకొని నిర్మాల్యం క్షీరాభిషేకం, పంచామృత అభిషేకాలు చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు, బంగారు కవచాలు, బెంగళూరు నుంచి తెప్పించిన ప్రత్యేక పూలతో బృందావనాన్ని చక్కగా అలంకరించారు.పీఠాధిపతి బృందావనానికి నైవేద్యాలు సమర్పించి మంగళహారతులు ఇచ్చారు.