ప్రకాశం: ఒంగోలు రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణపై రచించిన ఘట్టమనేని కృష్ణ జీవిత శతక రత్న వరాల పుస్తకాన్ని విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్షులు బేతంశెట్టి హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.