ATP: అనంతపురంలో రేపు జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేశారు. కలెక్టరేట్లో ఈ కార్యక్రమం జరగదని జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ సెలవు ఉన్నందున ఈ కార్యక్రమాన్ని రద్దు చేశామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.