KRNL: కృష్ణగిరి మండల కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువు విద్యాశాఖ ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సి పాల్ చైతన్య స్రవంతి ఆదివారం తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 22 నుం చి ఈ నెల 11 వరకు నిర్దేశించగా.. ప్రస్తుతం ఈ నెల 21వ తేదీ వరకు పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసిందన్నారు.