NLG: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో సీపీఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక స్తూపం వద్ద బుధవారం ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, గీత పని వారిలో సంఘం జిల్లా కార్యదర్శి బొడిగె సైదులు విచ్చేసి జెండా ఆవిష్కరణ చేశారు. గ్రామ నాయకులు పాల్గొన్నారు.