HYD: అంబేడ్కర్ జయంతి సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. రాజేంద్రనగర్ చౌరస్తా, బండ్లగూడ జాగీర్ ప్రాంతాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. అంబేడ్కర్ సిద్ధాంతాలను గుర్తుంచుకోవాలని.. న్యాయం, సమానత్వంపై ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.